గోవింద సుందర మోహన దీన మందార
మోహన రాగం త్రిపుట తాళం
ప: గోవింద సుందర మోహన దీన మందార గరుడ వాహన భవబంధాది దుష్కర్మ దహన భక్తవత్సల త్రిలోక పావన || గోవింద ||
చ 1: సతి సుతులపై ప్రేమ రోసితి సం తతము మీపై భారమువేసితి మదిలోన మిము కనులజూడగ నెంచి మీదయ కెపుడెదురెదురు జూచితి || గోవింద ||
చ 2: చాల దినములనుండి వేడితినే కాలహరణముచేసి గనలేనైతి మేలు నీ నామము పాడితి మేలుగా ముందటి విధమున వేడితి || గోవింద ||
చ 3: దీనరక్షకుడవని వింటిని నీ కనికర మే తీరున గందును మానస మున నమ్మియుందును నా మనవి చేకొన వేమందును || గోవింద ||
చ 4: అధికుడవని నమ్మినందుకు ఆశ్ర యించిన శ్రమబెట్టేదెందుకు మిము పెతకి వెలిసే దెందుకు మాకిది పూర్వకృత మనేటందుకు || గోవింద ||
చ 5: క్రోధాన వచ్చెను వార్థక్యము యిక ప్రాపేది బహు సామీప్యము పదములు విడనందు గోప్యమా మీరెపు డు చూపెదరు స్వరూపము || గోవింద ||
చ 6: భద్రగిరియందు లేదేమొ యునికి భక్తుల మొరవిని రావేమొ కరిగాచి న హరివి గాదేమో రామ దాసుని మొరవిని రావేమో || గోవింద ||
Roman transliteration (IAST)
Automatic transliteration.
mohana rāgaṃ tripuṭa tāl̤aṃ
pa: goviṃda suṃdara mohana dīna maṃdāra garuḍa vāhana bhavabaṃdhādi duṣkarma dahana bhaktavatsala triloka pāvana || goviṃda ||
ca 1: sati sutulapai prema rositi saṃ tatamu mīpai bhāramuvesiti madilona mimu kanulajūḍaga nèṃci mīdaya kèpuḍèdurèduru jūciti || goviṃda ||
ca 2: cāla dinamulanuṃḍi veḍitine kālaharaṇamucesi ganalenaiti melu nī nāmamu pāḍiti melugā muṃdaṭi vidhamuna veḍiti || goviṃda ||
ca 3: dīnarakṣakuḍavani viṃṭini nī kanikara me tīruna gaṃdunu mānasa muna nammiyuṃdunu nā manavi cekòna vemaṃdunu || goviṃda ||
ca 4: adhikuḍavani namminaṃduku āśra yiṃcina śramabèṭṭedèṃduku mimu pètaki vèlise dèṃduku mākidi pūrvakṛta maneṭaṃduku || goviṃda ||
ca 5: krodhāna vaccènu vārthakyamu yika prāpedi bahu sāmīpyamu padamulu viḍanaṃdu gopyamā mīrèpu ḍu cūpèdaru svarūpamu || goviṃda ||
ca 6: bhadragiriyaṃdu ledemò yuniki bhaktula mòravini rāvemò karigāci na harivi gādemo rāma dāsuni mòravini rāvemo || goviṃda ||
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Telugu Wikisource: గోవింద సుందర మోహన దీన మందార (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/te-govimda-sumdara-mohana-diina-mamdaara.html