అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము
ముఖారి రాగం త్రిపుట తాళం ప: అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము నెయ్యడ గాననయ్య శ్రీరామయ్య || అయ్యయ్యో ||
అ.ప.: ఇయ్యెడ నేను కుయ్యాడిన ఆలకించ వయ్యయ్యో యేమందు అయ్యా రామచంద్ర || అయ్యయ్యో ||
చ1: ఎంతని వేడుదు ఎంతని పాడుదు ఎంతని దూరుదు ఏమిసేతు రామ సుంతైనగాని నీ అంతరంగమదేమో వింత కరుగదు ఎంతో నమ్మినందుకు || అయ్యయ్యో ||
చ2: శరణన్న జనముల బిర బిర బ్రోచేటి బిరుదు గలిగినయట్టి దొరవని నే నీ మరుగు జొచ్చినందు కరమర జేయుట పరువే కరుణింప బరువే హరి హరి || అయ్యయ్యో ||
చ3: కామిత మందార కలుష విదూర తామసమేల తాళజాలనురా నీ మోము జూపుము స్వామి భద్రాచల రామదాసుని ప్రేమ రయమున నేలుము || అయ్యయ్యో ||
Roman transliteration (IAST)
Automatic transliteration.
mukhāri rāgaṃ tripuṭa tāl̤aṃ pa: ayyayyo nīvaṃṭi anyāya daivamu nèyyaḍa gānanayya śrīrāmayya || ayyayyo ||
a.pa.: iyyèḍa nenu kuyyāḍina ālakiṃca vayyayyo yemaṃdu ayyā rāmacaṃdra || ayyayyo ||
ca1: èṃtani veḍudu èṃtani pāḍudu èṃtani dūrudu emisetu rāma suṃtainagāni nī aṃtaraṃgamademo viṃta karugadu èṃto namminaṃduku || ayyayyo ||
ca2: śaraṇanna janamula bira bira broceṭi birudu galiginayaṭṭi dòravani ne nī marugu jòccinaṃdu karamara jeyuṭa paruve karuṇiṃpa baruve hari hari || ayyayyo ||
ca3: kāmita maṃdāra kaluṣa vidūra tāmasamela tāl̤ajālanurā nī momu jūpumu svāmi bhadrācala rāmadāsuni prema rayamuna nelumu || ayyayyo ||
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Telugu Wikisource: అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/te-ayyayyo-niivamti-anyaaya-daivamu.html