ఎందరో మహానుభావులు
ఎందరో మహానుభావు లందరికి వందనము ॥ఎందరో॥
చందురు వర్ణుని యందచందమును హృదయార విందమున జూచి బ్రహ్మానంద మనుభవించువా ॥రెందరో॥
సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్ధ న్యు ॥లెందరో॥
మానసవనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనేవా ॥రెందరో॥
సరగున బాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువా ॥రెందరో॥
పతితపావనుడనే పరాత్పరుని గురించి బరమార్థమగు నిజమార్గముతోను బాడుచును, సల్లాపముతో స్వరలయాది రాగముల తెలియువా ॥రెందరో॥
హరి గుణమణిమయ సరములు గళమున శోభిల్లు భక్తకోటు లిలలో తెలివితో చెలిమితో గరుణగల్గి జగమెల్లను సుధాదృష్టిచే బ్రోచువా ॥రెందరో॥
హోయలుమీఱ నడులుగల్గు సరసుని సదా గనుల జూచుచును, పులకశరీరులయి ఆనంద పయోధి నిమగ్నులయి ముదంబునను యశముగలవా ॥రెందరో॥
పరమభాగవత మౌనివరశశివిభాకర సనక సనందన దిగీశ సురకింపురుష కనక కశిపుసుత నారద తుంబురు పవనసూను బాలచంద్రధర శుకసరోజభవ భూసురవరులు పరమపావనులు ఘనులు శాశ్వతులు కమలభవసుఖము సదానుభవులుగాక ॥రెందరో॥
నీ మేను నామ వైభవమ్ములను నీ పరాక్రమ ధైర్యముల శాంత మా నసము నీవులను వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల జేసినట్టి నీమది నెఱింగి సతతంబునను గుణభజనానంద కీర్తనము జేయువా ॥రెందరో॥
భాగవత రామాయణ గీతాది శ్రుతిశాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూఢముల ముప్పదిముక్కోటి సురాంత రంగముల భావముల నెఱిగి భావరాగ లయాది సౌఖ్యముచే జిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైనవా ॥రెందరో॥
ప్రేమ ముప్పిరిగొను వేళ నామము దలచేవారు రామభక్తుడైన త్యాగరాజ నుతుని నిజదాసులైనవా ॥రెందరో॥
Roman transliteration (IAST)
Automatic transliteration.
èṃdaro mahānubhāvu laṃdariki vaṃdanamu ||èṃdaro||
caṃduru varṇuni yaṃdacaṃdamunu hṛdayāra viṃdamuna jūci brahmānaṃda manubhaviṃcuvā ||rèṃdaro||
sāmagānalola manasija lāvaṇya dhanyamūrdha nyu ||lèṃdaro||
mānasavanacara varasaṃcāramu nilipi mūrti bāgugā pòḍaganevā ||rèṃdaro||
saraguna bādamulaku svāṃtamanu sarojamunu samarpaṇamu seyuvā ||rèṃdaro||
patitapāvanuḍane parātparuni guriṃci baramārthamagu nijamārgamutonu bāḍucunu, sallāpamuto svaralayādi rāgamula tèliyuvā ||rèṃdaro||
hari guṇamaṇimaya saramulu gal̤amuna śobhillu bhaktakoṭu lilalo tèlivito cèlimito garuṇagalgi jagamèllanu sudhādṛṣṭice brocuvā ||rèṃdaro||
hoyalumīṟa naḍulugalgu sarasuni sadā ganula jūcucunu, pulakaśarīrulayi ānaṃda payodhi nimagnulayi mudaṃbunanu yaśamugalavā ||rèṃdaro||
paramabhāgavata maunivaraśaśivibhākara sanaka sanaṃdana digīśa surakiṃpuruṣa kanaka kaśipusuta nārada tuṃburu pavanasūnu bālacaṃdradhara śukasarojabhava bhūsuravarulu paramapāvanulu ghanulu śāśvatulu kamalabhavasukhamu sadānubhavulugāka ||rèṃdaro||
nī menu nāma vaibhavammulanu nī parākrama dhairyamula śāṃta mā nasamu nīvulanu vacana satyamunu raghuvara nīyèḍa sadbhaktiyu janiṃcakanu durmatamulanu kalla jesinaṭṭi nīmadi nèṟiṃgi satataṃbunanu guṇabhajanānaṃda kīrtanamu jeyuvā ||rèṃdaro||
bhāgavata rāmāyaṇa gītādi śrutiśāstra purāṇapu marmamulan śivādi ṣaṇmatamula gūḍhamula muppadimukkoṭi surāṃta raṃgamula bhāvamula nèṟigi bhāvarāga layādi saukhyamuce jirāyuvul galigi niravadhi sukhātmulai tyāgarājāptulainavā ||rèṃdaro||
prema muppirigònu vel̤a nāmamu dalacevāru rāmabhaktuḍaina tyāgarāja nutuni nijadāsulainavā ||rèṃdaro||
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Telugu Wikisource: ఎందరో మహానుభావులు (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/te-emdaro-mahaanubhaavulu.html