ఇనకుల తిలక ఏమయ్య రామయ్యా
ఆహిరి రాగం త్రిపుట తాళం ప: ఇనకుల తిలక ఏమయ్య రామయ్యా శ్రీరామచంద్రా విని వినకున్నావు వినరాదా నామొర శ్రీరామచంద్రా || ఇనకుల ||
చ 1: కనకాంబరధర కపటమేలనయ్యా శ్రీరామచంద్రా జనకాత్మజా రమణా జాగుసేయకు శ్రీరమచంద్రా || ఇనకుల ||
చ 2: దశరథసుత నాదశ జూడవయ్యా శ్రీరామచంద్రా పశుపతి నుతనామ ప్రార్థించి మ్రొక్కెద శ్రీరామచంద్రా || ఇనకుల ||
చ 3: నేవే గతియని నెర నమ్మియున్నాను శ్రీరామచంద్రా కావవే యీవేళ కాకుత్స కులతిలక శ్రీరామచంద్రా || ఇనకుల ||
చ 4: వైకుంఠవాసుడ విని బాధ మాన్పవే శ్రీరామచంద్రా నీ కంటె గతిలేరు నిర్దయజూడకు శ్రీరామచంద్రా || ఇనకుల ||
చ 5: రామభద్ర శైలధామ శ్రీరామ శ్రీరామచంద్రా వేమరు వేడెద రామదాసుని బ్రోవ శ్రీరామచంద్ర || ఇనకుల ||
Roman transliteration (IAST)
Automatic transliteration.
āhiri rāgaṃ tripuṭa tāl̤aṃ pa: inakula tilaka emayya rāmayyā śrīrāmacaṃdrā vini vinakunnāvu vinarādā nāmòra śrīrāmacaṃdrā || inakula ||
ca 1: kanakāṃbaradhara kapaṭamelanayyā śrīrāmacaṃdrā janakātmajā ramaṇā jāguseyaku śrīramacaṃdrā || inakula ||
ca 2: daśarathasuta nādaśa jūḍavayyā śrīrāmacaṃdrā paśupati nutanāma prārthiṃci mròkkèda śrīrāmacaṃdrā || inakula ||
ca 3: neve gatiyani nèra nammiyunnānu śrīrāmacaṃdrā kāvave yīvel̤a kākutsa kulatilaka śrīrāmacaṃdrā || inakula ||
ca 4: vaikuṃṭhavāsuḍa vini bādha mānpave śrīrāmacaṃdrā nī kaṃṭè gatileru nirdayajūḍaku śrīrāmacaṃdrā || inakula ||
ca 5: rāmabhadra śailadhāma śrīrāma śrīrāmacaṃdrā vemaru veḍèda rāmadāsuni brova śrīrāmacaṃdra || inakula ||
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Telugu Wikisource: ఇనకుల తిలక ఏమయ్య రామయ్యా (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/te-inakula-tilaka-emayya-raamayyaa.html