ఇక్ష్వాకుకులతిలక
కాంభోజి రాగం త్రిపుట తాళం
ప: ఇక్ష్వాకు కుల తిలక యికనైన పలుకవె రామచంద్రా నన్ను రక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్రా || ఇక్ష్వాకు ||
చ1: చుట్టు ప్రాకారములు సొంపుగచేయిస్తి రామచంద్రా ఆ ప్రాకారమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా || ఇక్ష్వాకు ||
చ2: గోపుర మంటపాలు కుదురుగ కట్టిస్తి రామచంద్రా నను క్రొత్తగ చూడక నిత్తరి బ్రోవుము రామచంద్రా || ఇక్ష్వాకు ||
చ3: భరతునకు చేసితి పచ్చల పతకము రామచంద్రా ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా || ఇక్ష్వాకు ||
చ4: శత్రుఘ్నునకు నేను చేసితి మొలత్రాడు రామచంద్రా ఆ మొలత్రాడునకు పట్టె మొహరీలు పదివేలు రామచంద్రా || ఇక్ష్వాకు ||
చ5: లక్ష్మణునకు చేసితి ముత్యాల పతకము రామచంద్రా ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా || ఇక్ష్వాకు ||
చ6: సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా || ఇక్ష్వాకు ||
చ7: వాహనములు మీకు వరుసతో చేసితి రామచంద్రా జగ న్మోహన సంకెళ్ళు వేసిరి కాళ్ళకు రామచంద్రా || ఇక్ష్వాకు ||
చ8: కలికి తురాయి నీకు పొలుపుగ చేసితి రామచంద్రా నీవు కులుకుచు తిరిగెద వెవరబ్బ సొమ్మని రామచంద్రా || ఇక్ష్వాకు ||
చ9: మీ తండ్రి దశరథ మహారాజు మెట్టెనా రామచంద్రా లేక మీ మామ జనక మహారాజు పంపెనా రామచంద్రా || ఇక్ష్వాకు ||
చ10: అబ్బా తిట్టితినని ఆయాసపడవద్దు రామచంద్రా ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా || ఇక్ష్వాకు ||
చ11: సర్కారు పైకము తృణముగ నెంచకు రామచంద్రా దెబ్బల కోర్వను అప్పుతీర్పుమయ్య రామచంద్రా || ఇక్ష్వాకు ||
చ12: ఏటికి చల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచంద్రా నేను అధములందరికంటె అన్యాయమైతిని రామచంద్రా || ఇక్ష్వాకు ||
చ13: కౌసల్య పుత్రుడు దశరధ తనయుడు రామచంద్రా కావు క్షేమముగ భద్రాద్రి నెలకొన్న శ్రీ రామచంద్రా || ఇక్ష్వాకు ||
చ14: భక్తులందరిని పరిపాలించెడి శ్రీరామచంద్రా నీవు క్షేమముగ రామదాసుని నేలుము || ఇక్ష్వాకు ||
Roman transliteration (IAST)
Automatic transliteration.
kāṃbhoji rāgaṃ tripuṭa tāl̤aṃ
pa: ikṣvāku kula tilaka yikanaina palukavè rāmacaṃdrā nannu rakṣiṃpa kunnanu rakṣaku lèvariṃka rāmacaṃdrā || ikṣvāku ||
ca1: cuṭṭu prākāramulu sòṃpugaceyisti rāmacaṃdrā ā prākāramunaku paṭṭè padivela varahālu rāmacaṃdrā || ikṣvāku ||
ca2: gopura maṃṭapālu kuduruga kaṭṭisti rāmacaṃdrā nanu kròttaga cūḍaka nittari brovumu rāmacaṃdrā || ikṣvāku ||
ca3: bharatunaku cesiti paccala patakamu rāmacaṃdrā ā patakamunaku paṭṭè padivela varahālu rāmacaṃdrā || ikṣvāku ||
ca4: śatrughnunaku nenu cesiti mòlatrāḍu rāmacaṃdrā ā mòlatrāḍunaku paṭṭè mòharīlu padivelu rāmacaṃdrā || ikṣvāku ||
ca5: lakṣmaṇunaku cesiti mutyāla patakamu rāmacaṃdrā ā patakamunaku paṭṭè padivela varahālu rāmacaṃdrā || ikṣvāku ||
ca6: sītammaku ceyisti ciṃtāku patakamu rāmacaṃdrā ā patakamunaku paṭṭè padivela varahālu rāmacaṃdrā || ikṣvāku ||
ca7: vāhanamulu mīku varusato cesiti rāmacaṃdrā jaga nmohana saṃkèl̤l̤u vesiri kāl̤l̤aku rāmacaṃdrā || ikṣvāku ||
ca8: kaliki turāyi nīku pòlupuga cesiti rāmacaṃdrā nīvu kulukucu tirigèda vèvarabba sòmmani rāmacaṃdrā || ikṣvāku ||
ca9: mī taṃḍri daśaratha mahārāju mèṭṭènā rāmacaṃdrā leka mī māma janaka mahārāju paṃpènā rāmacaṃdrā || ikṣvāku ||
ca10: abbā tiṭṭitinani āyāsapaḍavaddu rāmacaṃdrā ī dèbbala korvaka abba tiṭṭitinayya rāmacaṃdrā || ikṣvāku ||
ca11: sarkāru paikamu tṛṇamuga nèṃcaku rāmacaṃdrā dèbbala korvanu apputīrpumayya rāmacaṃdrā || ikṣvāku ||
ca12: eṭiki callina nīl̤l̤āyè nā bratuku rāmacaṃdrā nenu adhamulaṃdarikaṃṭè anyāyamaitini rāmacaṃdrā || ikṣvāku ||
ca13: kausalya putruḍu daśaradha tanayuḍu rāmacaṃdrā kāvu kṣemamuga bhadrādri nèlakònna śrī rāmacaṃdrā || ikṣvāku ||
ca14: bhaktulaṃdarini paripāliṃcèḍi śrīrāmacaṃdrā nīvu kṣemamuga rāmadāsuni nelumu || ikṣvāku ||
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Telugu Wikisource: ఇక్ష్వాకుకులతిలక (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/te-ikshvaakukulatilaka.html