సీతారామస్వామి

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. సావేరి రాగం ఆది తాళం ప: సీతారామస్వామి నే జేసిన నేరంబేమి || సీతా ||

  2. అ.ప: ఖ్యాతిగ నీపద పంకజయుగములు నే ప్రీతిగ తలుపక భేద మెంచితినా || సీతా ||

  3. చ 1: రంగుగ నా పదివేళ్ళకు - రత్నపు టుంగరములు నిన్నడిగితినా సంగతి బంగరు శాలువ పాగా - లంగీల్ నడికట్లడిగితినా చెంగటి భూసుర పుంగవు లెన్నగ - చెవులకు చౌకట్ల డిగితినా పొంగుచు మువ్వలు ముత్యపుసరములు - బాగుగ నిమ్మని యడిగితినా || సీతా ||

  4. చ 2: ప్రేమతో నవరత్నంబులు దాపిన - హేమ కిరీటంబడిగితినా కోమలమగు నీ మెడలో పుష్పపు - ధామంబులు నే నడిగితినా మోమాటము పడకుండగ నీవగు - మురుగులు గొలుసులు అడిగితినా కమలేక్షణ మిము సేవించుటకై - ఘనముగ రమ్మని పిలిచితిగాని || సీతా ||

  5. చ 3: తరచుగ నీ పాదంబుల నమరిన - సరిగజ్జెలను అడిగితినా కరుణారస ముప్పొంగ మీ గజ - తురగము లిమ్మని యడిగితినా పరమాత్మ నీ బంగరు శాలువ - పై గప్పగ నే నడిగితినా స్మర సుందర సురవర సంరక్షక - వరమిమ్మని నిన్నడిగితినా || సీతా ||

  6. చ 4: ప్రశస్త భద్రాద్రీశుడవని నిను - ప్రభుత్వ మిమ్మని యడిగితినా దశరధ సుత నీచేత ధరించిన - దాన కంకణ మ్మడిగితినా విశదముగను నీ మేలిమి మొల నూల్ - వేడుకతో నే నడిగితినా యేదుము భూమిని కుచ్చల నేలకు - నెక్కువగా నిన్నడిగితినా || సీతా ||

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. sāveri rāgaṃ ādi tāl̤aṃ pa: sītārāmasvāmi ne jesina neraṃbemi || sītā ||

  2. a.pa: khyātiga nīpada paṃkajayugamulu ne prītiga talupaka bheda mèṃcitinā || sītā ||

  3. ca 1: raṃguga nā padivel̤l̤aku - ratnapu ṭuṃgaramulu ninnaḍigitinā saṃgati baṃgaru śāluva pāgā - laṃgīl naḍikaṭlaḍigitinā cèṃgaṭi bhūsura puṃgavu lènnaga - cèvulaku caukaṭla ḍigitinā pòṃgucu muvvalu mutyapusaramulu - bāguga nimmani yaḍigitinā || sītā ||

  4. ca 2: premato navaratnaṃbulu dāpina - hema kirīṭaṃbaḍigitinā komalamagu nī mèḍalo puṣpapu - dhāmaṃbulu ne naḍigitinā momāṭamu paḍakuṃḍaga nīvagu - murugulu gòlusulu aḍigitinā kamalekṣaṇa mimu seviṃcuṭakai - ghanamuga rammani pilicitigāni || sītā ||

  5. ca 3: taracuga nī pādaṃbula namarina - sarigajjèlanu aḍigitinā karuṇārasa muppòṃga mī gaja - turagamu limmani yaḍigitinā paramātma nī baṃgaru śāluva - pai gappaga ne naḍigitinā smara suṃdara suravara saṃrakṣaka - varamimmani ninnaḍigitinā || sītā ||

  6. ca 4: praśasta bhadrādrīśuḍavani ninu - prabhutva mimmani yaḍigitinā daśaradha suta nīceta dhariṃcina - dāna kaṃkaṇa mmaḍigitinā viśadamuganu nī melimi mòla nūl - veḍukato ne naḍigitinā yedumu bhūmini kuccala nelaku - nèkkuvagā ninnaḍigitinā || sītā ||

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Telugu Wikisource: సీతారామస్వామి (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.