తందనాన ఆహి
ప|| తందనాన ఆహి తందనాన పురె | తందనాన భళా తందనాన || చ|| బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే | పరబ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే ||
చ|| కందువగు హీనాధికము లిందు లేవు | అందరికి శ్రీహరే అంతరాత్మ | ఇందులో జంతుకులమింతా నొకటే | అందరికి శ్రీహరే అంతరాత్మ ||
చ|| నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే | అండనే బంటునిద్ర అదియు నొకటే | మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే | చండాలు డుండేటి సరిభూమి యొకటే ||
చ|| అనుగుదేవతలకును అలకామ సుఖమొకటే | ఘనకీట పశువులకు కామ సుఖమొకటే | దినమహో రాత్రములు తెగి ధనాఢ్యునకొకటే | వొనర నిరుపేదకును వొక్కటే అవియు ||
చ|| కొరలి శిష్టాన్నములు గొను నాకలొకటే | తిరుగు దుష్టాన్నములు తిను నాకలొకటే | పరగ దుర్గంధములపై వాయువొకటే | వరుస బరిమళముపై వాయువొకటే ||
చ|| కడగి యేనుగు మీద గాయు యెండొకటే | పుడమి శునకము మీద బొలయు నెండొకటే | కడు బుణ్యులను బాప కర్ములను సరిగావ | జడియు శ్రీ వేంకటేశ్వర నామమొకటే ||
Roman transliteration (IAST)
Automatic transliteration.
pa|| taṃdanāna āhi taṃdanāna purè | taṃdanāna bhal̤ā taṃdanāna || ca|| brahma mòkaṭe parabrahma mòkaṭe | parabrahma mòkaṭe parabrahma mòkaṭe ||
ca|| kaṃduvagu hīnādhikamu liṃdu levu | aṃdariki śrīhare aṃtarātma | iṃdulo jaṃtukulamiṃtā nòkaṭe | aṃdariki śrīhare aṃtarātma ||
ca|| niṃḍāra rāju nidriṃcu nidrayu nòkaṭe | aṃḍane baṃṭunidra adiyu nòkaṭe | mèṃḍaina brāhmaṇuḍu mèṭṭubhūmi yòkaṭe | caṃḍālu ḍuṃḍeṭi saribhūmi yòkaṭe ||
ca|| anugudevatalakunu alakāma sukhamòkaṭe | ghanakīṭa paśuvulaku kāma sukhamòkaṭe | dinamaho rātramulu tègi dhanāḍhyunakòkaṭe | vònara nirupedakunu vòkkaṭe aviyu ||
ca|| kòrali śiṣṭānnamulu gònu nākalòkaṭe | tirugu duṣṭānnamulu tinu nākalòkaṭe | paraga durgaṃdhamulapai vāyuvòkaṭe | varusa barimal̤amupai vāyuvòkaṭe ||
ca|| kaḍagi yenugu mīda gāyu yèṃḍòkaṭe | puḍami śunakamu mīda bòlayu nèṃḍòkaṭe | kaḍu buṇyulanu bāpa karmulanu sarigāva | jaḍiyu śrī veṃkaṭeśvara nāmamòkaṭe ||
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Telugu Wikisource: తందనాన ఆహి (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/te-tamdanaana-aahi.html