దుడుకు గల

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. గౌళ - ఆది

  2. దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా ఎంతో ॥దుడుకు॥

  3. కడు దుర్విషయాకృష్టుడై గడియ గడియకు నిండారు ॥దుడుకు॥

  4. శ్రీవనితా హృత్కుముదాబ్జ, అవాఙ్మానసగోచర సకల భూతములయందు నీవై యుండగా మదిలేక బోయిన ॥దు॥

  5. చిఱుతప్రాయములనాడే, భజనామృత రసవిహీన కుతర్కుడైన

  6. ॥దు॥

  7. పరధనముల కొఱకు నొరుల మది కరగబలికి కడుపునింప తిరిగినట్టి

  8. ॥దు॥

  9. తన మదిని భువిని సౌఖ్యపు జీ- వనమె యనుచు సదా దినములు గడిపే

  10. ॥దు॥

  11. తెలియని నటవిట క్షుద్రులు వనితలు స్వవశమవుట కువదిశించి, సంతసిల్లి స్వరలయంబు లెఱుంగకను శిలాత్ములై సుభక్తులకు సమానమను

  12. ॥దు॥

  13. దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేవామిత ధనాదులను, దేవాదిదేవ నెర నమ్మితి గాకను నీ పదాబ్జ భజనంబు మఱచిన

  14. ॥దు॥

  15. చక్కని ముఖకమలంబును సదా నా మదిలో స్మరణ లేకనే దుర్మదాంధ జనులకోరి పరి- తాపములచేదగిలి నొగిలి దుర్విషయ దురాసలను రోయలేక సతత మపరాధినయి, చపలచిత్తుడనైన

  16. ॥దు॥

  17. మానవతను దుర్లభమనుచు నెంచి పరమానంద మొందలేక, మదమత్సర కామలోభమోహాలకు దాసుడయి మోసబోతిగాక, మొదటి కులజుడగుచు భువివి శూద్రుల పనులు సల్పుచునుంటినిగాక, నరాధములును రోయ రసవిహీన- మయినను సాధింప తారుమారు సతులకు కొన్నాళ్ళస్తికై సుతులకి కొన్నాళ్ళు ధనపతులకై తిరిగితినయ్య త్యాగరాజాప్త ఇటువంటి

  18. ॥దు॥

  19. చుడండి: త్యాగరాజు తెలుగు సాహిత్యము తెలుగు పంచరత్న కృతులు

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. gaul̤a - ādi

  2. duḍukugala nanne dòrakòḍuku brocurā èṃto ||duḍuku||

  3. kaḍu durviṣayākṛṣṭuḍai gaḍiya gaḍiyaku niṃḍāru ||duḍuku||

  4. śrīvanitā hṛtkumudābja, avāṅmānasagocara sakala bhūtamulayaṃdu nīvai yuṃḍagā madileka boyina ||du||

  5. ciṟutaprāyamulanāḍe, bhajanāmṛta rasavihīna kutarkuḍaina

  6. ||du||

  7. paradhanamula kòṟaku nòrula madi karagabaliki kaḍupuniṃpa tiriginaṭṭi

  8. ||du||

  9. tana madini bhuvini saukhyapu jī- vanamè yanucu sadā dinamulu gaḍipe

  10. ||du||

  11. tèliyani naṭaviṭa kṣudrulu vanitalu svavaśamavuṭa kuvadiśiṃci, saṃtasilli svaralayaṃbu lèṟuṃgakanu śilātmulai subhaktulaku samānamanu

  12. ||du||

  13. dṛṣṭiki sāraṃbagu lalanā sadanārbhaka sevāmita dhanādulanu, devādideva nèra nammiti gākanu nī padābja bhajanaṃbu maṟacina

  14. ||du||

  15. cakkani mukhakamalaṃbunu sadā nā madilo smaraṇa lekane durmadāṃdha janulakori pari- tāpamulacedagili nògili durviṣaya durāsalanu royaleka satata maparādhinayi, capalacittuḍanaina

  16. ||du||

  17. mānavatanu durlabhamanucu nèṃci paramānaṃda mòṃdaleka, madamatsara kāmalobhamohālaku dāsuḍayi mosabotigāka, mòdaṭi kulajuḍagucu bhuvivi śūdrula panulu salpucunuṃṭinigāka, narādhamulunu roya rasavihīna- mayinanu sādhiṃpa tārumāru satulaku kònnāl̤l̤astikai sutulaki kònnāl̤l̤u dhanapatulakai tirigitinayya tyāgarājāpta iṭuvaṃṭi

  18. ||du||

  19. cuḍaṃḍi: tyāgarāju tèlugu sāhityamu tèlugu paṃcaratna kṛtulu

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Telugu Wikisource: దుడుకు గల (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.