తక్కువేమి మనకు

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. సౌరాష్ట్ర రాగం ఆది తాళం ప: తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు

  2. చ 1: ప్రక్క తోడుగా భగవంతుడు తన చక్రధారియై చెంతనె యుండగ || తక్కువేమి ||

  3. చ 2: మ్రుచ్చు సోమకుని జంపిన యా మత్స్యమూర్తి మన పక్షము నుండగ || తక్కువేమి ||

  4. చ 3: సురల కొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృపమనకుండగ || తక్కువేమి ||

  5. చ 4: దురాత్ముడౌ హిరణ్యాక్షు ద్రుంచిన వరాహమూర్తి మనవాడై యుండగ || తక్కువేమి ||

  6. చ 5: హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా పరచిన నరహరి ప్రక్కన నుండగ || తక్కువేమి ||

  7. చ 6: భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మనవాడై యుండగ || తక్కువేమి ||

  8. చ 7: ధరలో క్షత్రియులను దండించిన పరశురాముని దయ మనకుండగ || తక్కువేమి ||

  9. చ 8: దశగ్రీవు మును దండించిన యా దశరథరాముని దయ మనకుండగ || తక్కువేమి ||

  10. చ 9: ఇలలో యదుకులమున నుదయించిన బలరాముడు మన బలమై యుండగ || తక్కువేమి ||

  11. చ 10: దుష్ట కంసుని ద్రుంచినట్టి శ్రీ కృష్ణుడు మనపై కృపతో నుండగ || తక్కువేమి ||

  12. చ 11: కలియుగాంత్యమున కలిగిన దైవము కలికిమూర్తిమము గాచుచు నుండగ || తక్కువేమి ||

  13. చ 12: నారాయణదాసుని గాచిన శ్రీమన్ నారాయణు నెర నమ్మియుండగ || తక్కువేమి ||

  14. చ 13: రామదాసు నిల రక్షించెదనని ప్రేమతొ పలికిన ప్రభువిట నుండగ || తక్కువేమి ||

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. saurāṣṭra rāgaṃ ādi tāl̤aṃ pa: takkuvemi manaku rāmuḍu òkkaḍuṃḍu varaku

  2. ca 1: prakka toḍugā bhagavaṃtuḍu tana cakradhāriyai cèṃtanè yuṃḍaga || takkuvemi ||

  3. ca 2: mruccu somakuni jaṃpina yā matsyamūrti mana pakṣamu nuṃḍaga || takkuvemi ||

  4. ca 3: surala kòraku maṃdaragiri mosina kūrmāvatāruni kṛpamanakuṃḍaga || takkuvemi ||

  5. ca 4: durātmuḍau hiraṇyākṣu druṃcina varāhamūrti manavāḍai yuṃḍaga || takkuvemi ||

  6. ca 5: hiraṇyakaśipuni irucèkkalugā paracina narahari prakkana nuṃḍaga || takkuvemi ||

  7. ca 6: bhūmi svargamunu pòṃduga gòlicina vāmanuṃḍu manavāḍai yuṃḍaga || takkuvemi ||

  8. ca 7: dharalo kṣatriyulanu daṃḍiṃcina paraśurāmuni daya manakuṃḍaga || takkuvemi ||

  9. ca 8: daśagrīvu munu daṃḍiṃcina yā daśaratharāmuni daya manakuṃḍaga || takkuvemi ||

  10. ca 9: ilalo yadukulamuna nudayiṃcina balarāmuḍu mana balamai yuṃḍaga || takkuvemi ||

  11. ca 10: duṣṭa kaṃsuni druṃcinaṭṭi śrī kṛṣṇuḍu manapai kṛpato nuṃḍaga || takkuvemi ||

  12. ca 11: kaliyugāṃtyamuna kaligina daivamu kalikimūrtimamu gācucu nuṃḍaga || takkuvemi ||

  13. ca 12: nārāyaṇadāsuni gācina śrīman nārāyaṇu nèra nammiyuṃḍaga || takkuvemi ||

  14. ca 13: rāmadāsu nila rakṣiṃcèdanani prematò palikina prabhuviṭa nuṃḍaga || takkuvemi ||

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Telugu Wikisource: తక్కువేమి మనకు (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.